కోదాడ పట్టణంలో నేత్రదానం

కోదాడ పట్టణంలో నేత్రదానం

NLG:  కోదాడ పట్టణంలో కందిబండ అనసూర్యమ్మ (82) శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. స్వర్ణభారతి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబ సభ్యుల అనుమతితో ఖమ్మం నేత్రాలయ నుంచి వచ్చిన వైద్యులు ఆమె కళ్లను సేకరించారు. నేత్రదానంతో చూపులేని నలుగురికి మేలు జరుగుతుందని ట్రస్టు నేత్ర దాన ఇన్ఛార్జి పైడిమర్రి సుధాకర్ తెలిపారు.