జిల్లా ఏఎస్పీగా బాధ్యతల స్వీకరణ
సత్యసాయి: జిల్లాలో శాంతి భద్రతలు, మహిళలు, చిన్నారుల రక్షణే తన ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తానని నూతన అడిషనల్ ఎస్పీ అంకిత సురాన మహావీర్ తెలిపారు. పార్వతీపురం సబ్ డివిజనల్ అధికారిగా పనిచేసిన ఆమె పదోన్నతిపై ఇవాళ జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నట్లు పేర్కొన్నారు.