పెదకాకాని బాజీ బాబా దర్గా అభివృద్ధి పనులు ప్రారంభం
GNTR: పెదకాకానిలోని బాజీ బాబా దర్గా అభివృద్ధికి వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు పనులు ప్రారంభమయ్యాయి. శుక్రవారం దర్గా పరిసరాల్లోని చెత్త తొలగింపు పనులు చేపట్టామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని దర్గా ఈవో షేక్ కాజా మస్తాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ బాజీ, షేక్ సిలార్ తదితరులు పాల్గొన్నారు.