'19న స్వచ్ఛాంధ్ర డేను నిర్వహించాలి'

'19న స్వచ్ఛాంధ్ర డేను నిర్వహించాలి'

CTR: ఈ నెల 19వ తేదీన అన్ని పాఠశాలల్లో స్వచ్ఛాంధ్ర డేను నిర్వహించాలని డీఈవో వరలక్ష్మి శుక్రవారం తెలిపారు. 'ప్లాస్టిక్ కాలుష్యానికి ముప్పు' అనే అంశంపై ఉదయం ప్రార్థనా సమయంలో విద్యార్థులకు వివరించాలన్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి అనుసంధానంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. విద్యార్థులలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించాలన్నారు.