కరీంనగర్ కమీషనరేట్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

కరీంనగర్ కమీషనరేట్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

KNR: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా కమీషనరేట్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కరీంనగర్‌లోని పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన దాదాపు 1,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల సందర్శనార్ధం పోలీసుశాఖలోని వివిధ విభాగాల పనితీరును తెలిపే విధంగా పరేడ్ గ్రౌండ్‌లో పలు స్టాల్‌లను ఏర్పాటు చేశారు.