భక్తులతో కిక్కిరిసిపోయిన మంగళగిరి క్షేత్రం

GNTR: శ్రావణ శుక్రవారం సందర్భంగా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఈవో సునీల్ కుమార్ సమక్షంలో అర్చకులు వ్రతాలు నిర్వహించారు. తొలుత రాజ్యలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.