నూతన ఎస్సైగా పి. సత్యనారాయణ బాధ్యతలు స్వీకరణ
ప్రకాశం: పొన్నలూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్‌గా పి. సత్యనారాయణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీస్ సిబ్బంది నూతన ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపారు.