సూర్యాపేటలో వృద్ధురాలి అదృశ్యం

సూర్యాపేటలో వృద్ధురాలి అదృశ్యం

SRPT: బౌరోజు సంపూర్ణ(58) అనే వృద్ధురాలు అదృశ్యమైన ఘటన సూర్యాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంపూర్ణ కొడుకు సంతోష్ కుమార్ తెలిపిన వివరాలు మేరకు.. తన తల్లి మానసిక స్థితి బాగాలేని కారణంగా ఈనెల 2వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదనీ తెలిపారు. కాగా చుట్టుపక్కల, బిబంధువుల ఇళ్లలో, వెతికిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.