నార్నూర్‌కు అంతర్జాతీయ గుర్తింపు
ADB: బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో సోమవారం నార్నూర్ మేజర్ గ్రామపంచాయతీకి గౌరవప్రదమైన గుర్తింపు లభించింది. సర్పంచ్ బానోత్ కవేరికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ISO 9001:2015 నాణ్యత సర్టిఫికేట్ అందజేశారు. గ్రామంలో పారదర్శక పరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు ఈ గుర్తింపు దక్కింది.