ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసిన మంత్రి

ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసిన మంత్రి

JGL: ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ పాలన కొనసాగుతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణంలోని షాదీ ఖానాలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. జిల్లాలో 590 మంది మహిళలకు తొలి విడతలో మిషన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్య ప్రసాద్ పాల్గొన్నారు.