త్వరలో KCRని కలుస్తా: అఖిలేష్ యాదవ్
TG: రాజకీయాల్లో ఎత్తు పల్లాలు సహజమని BRS నేతలతో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నందినగర్‌లో KTR, హరీష్ రావుతో భేటీ అయిన ఆయన.. కొన్నిసార్లు ప్రజలు ఆమోదిస్తారు, మరి కొన్నిసార్లు తిరస్కరిస్తారని.. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల్లోనే ఉండాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా త్వరలోనే గులాబీ బాస్ KCRని కలుస్తానని తెలిపారు.