పోలీసులు కార్డెన్ సెర్చ్ 59 వాహనాలు సీజ్
NRML: తానూర్ మండలం కొల్లూరు గ్రామంలో ముధోల్ సీఐ మల్లేష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 55 బైక్‌లు, 4 ఆటోలను సీజ్ చేశారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే పోలీసు శాఖ నిరంతరం కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తుందని సీఐ తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడొద్దని హెచ్చరించారు. గ్రామంలో ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా చూడాలన్నారు.