ఈనెల 15 నుంచి పశువులకు గాలికుంటు టీకాలు

GNTR: తెనాలిలో పశువులకు ఈనెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయనున్నట్లు పశుసంవర్ధక సహాయ సంచాలకులు నాగిరెడ్డి తెలిపారు. బుర్రిపాలెంలోని పశువుల ఆసుపత్రిలో ఆయన మాట్లాడుతూ.. వ్యాధి ఎక్కువగా గేదెలకు సోకుతుందని, నివారణకు సంవత్సరానికి రెండు సార్లు టీకాలు వేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పశువుల యజమానుల హకరించాలని కోరారు.