లోకమాత పోచమ్మ తల్లికి పంచామృత అభిషేకం

JGL: జగిత్యాల పట్టణంలోని శ్రీ లోకమాత పోచమ్మ ఆలయం 63వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం బ్రహ్మశ్రీ తిగుళ్ళ విషు శర్మ గారి ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. గోదావరి జలముతో 108 దంపతులచే కలశాభిషేకంతో ఉత్సవాలు ఘనంగా చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.