చిన్న శేష వాహనంపై దర్శనమిచ్చిన వెంకయ్య స్వామి

చిన్న శేష వాహనంపై దర్శనమిచ్చిన వెంకయ్య స్వామి

NLR: వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామంలో వెలసి ఉన్న భగవాన్ వెంకయ్య స్వామి 43వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం స్వామివారు చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన కమిటీ సభ్యులు తగు చర్యలు తీసుకుంటున్నారు.