పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించిన పోలీసులు

పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించిన పోలీసులు

CTR: కుప్పం రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో గుడిపల్లి మండలం యామగానిపల్లి గ్రామంలో నిన్న రాత్రి “పోలీస్ పల్లె నిద్ర” కార్యక్రమం నిర్వహించారు. సీఐ మల్లేష్ యాదవ్ గ్రామస్తులతో మాట్లాడి దొంగతనాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన, మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామ సమస్యలను తెలుసుకుని తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.