'యువత భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది'
ATP: మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డా.పోతుల నాగరాజు డిమాండ్ చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. తరగతి గదుల్లో సైతం మత్తు పదార్థాలు దొరకడం ప్రభుత్వ పాలన వైఫల్యమే అన్నారు. దీని వల్ల యువత భవిష్యత్తు సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.