విజయవాడలో 88 మందికి భారీగా జరిమానా

విజయవాడలో 88 మందికి భారీగా జరిమానా

విజయవాడలో మంగళవారం మద్యం తాగి వాహనాలు నడిపే 88 మందిని అదుపులోకి తీసుకున్నట్లు 2, 5, 6 పట్టణ పోలీసులు తెలిపారు. వారిని సంబంధిత కోర్టుల్లో ప్రవేశపెట్టగా న్యాయమూర్తులు లెనిన్ బాబు, శర్మ, 88 మందిలో 11 మందికి ఒక్కొక్కరికి రూ.15 వేలు, 77 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారన్నారు.