అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఆత్మహత్య

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఆత్మహత్య

ఏలూరు శ్రీరామ్ నగర్లో నివాసం ఉంటున్న బోను సతీష్ (38) మంగళవారం ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికంగా ఒక సూపర్ బజార్లో గుమస్తాగా పనిచేస్తున్న సతీష్ భార్య, ఇద్దరు కుమార్తెలతో జీవిస్తున్నాడు. మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.