అత్యవసరమైతేనే రాత్రి ప్రయాణాలు: ఎస్పీ
NRML: రాత్రి వేళల్లో ప్రయాణాలు తగ్గించుకోవాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని ఎస్పీ జానకి షర్మిల హితవులిలికారు. భైంసా ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆమె ప్రమాద సమాచారం అందగానే పోలీసులు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టారని వివరించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు. వాహనదారులు నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలన్నారు.