ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
MDCL: ఈతకెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధి డబిల్‌పూర్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు ఆదివారం ఈత కొట్టేందుకు ఇస్కాన్ టెంపుల్ సమీపంలో ఉన్న నీటి గుంత దగ్గరికి వెళ్లారు. అందులో దిగి ఈత కొడుతుండగా, వారిలో షేక్ ఉమన్, ఇర్ఫాన్ అనే ఇద్దరు మరింత ముందుకు వెళ్లగా అక్కడ లోతు ఎక్కువ ఉండడంతో మునిగిపోయారు.