బైక్ చోరీలకు పాల్పడిన ముగ్గురి అరెస్ట్
ELR: మండవల్లి మండల పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు CI రవికుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలం గంగుపల్లి తండాకు చెందిన రామవత్ దుర్గాప్రసాద్ నాయక్, మైనర్ బాలుడు, సీతారామపురం తండాకు చెందిన బాణావత్ తులసిబాబు నాయక్‌లు ఈ చోరీలకు పాల్పడుతున్నారు. SI రామచంద్రరావు నేతృత్వంలో నిందితులను అరెస్టు చేశారు.