ముందస్తు అడ్మిషన్లపై DSF ఆందోళన
KRNL: ఆదోని డివిజన్‌లో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని DSF నేతలు ఇవాళ ఆరోపించారు. ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ.. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించకపోతే గుర్తింపు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.