తాళ్లవలస డయేరియా కేసుల నమోదుపై సీఎం ఆరా
AP: శ్రీకాకుళం జిల్లా తాళ్లవలస డయేరియా కేసుల నమోదుపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. గ్రామస్తులు ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తులకు సురక్షిత మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమీప గ్రామాలపైనా దృష్టి సారించాలని సూచించారు. అయితే, తాళ్లవలసలో వృద్ధుడి మరణానికి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణమని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.