కొద్దిపాటి ప్రవాహానికే మునిగిన రోడ్డు

కొద్దిపాటి ప్రవాహానికే మునిగిన రోడ్డు

KDP: పెన్నానదికి నీటి ప్రవాహం వచ్చిన ప్రతిసారి RTPP-ప్రొద్దుటూరు మద్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. మైలవరం డ్యాం నుంచి పెన్నా నదిలోకి కొద్దిపాటి నీరు విడుదలైనా రామేశ్వరం రైల్వే బ్రిడ్జి వద్ద రోడ్డు మునిగిపోతోంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు ఆగిపోతున్నాయి. RTPP నుంచి పోట్లదుర్తి మీదుగా చుట్టూ తిరిగి ప్రొద్దుటూరుకు రావాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన పడుతున్నారు.