దారుణం.. ఐదో తరగతి బాలికపై అత్యాచారం
కోనసీమ: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐ.పోలవరంలో ఐదో తరగతి చదువుతున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఆర్.బాబీ(48) ప్రభుత్వ ఉన్నత పాఠశాల కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సమీపంలో ఉన్న ఐదో తరగతి బాలిక(11)పై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు బాబీపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.