VIDEO: నేషనల్ హైవేపై దట్టమైన పొగ మంచు
కృష్ణ: దట్టమైన పొగమంచు వాహనదారులను వణికిస్తోంది. సోమవారం తెల్లవారుజామున వర్షంలా కురుస్తున్న మంచుతో గన్నవరం నుంచి హనుమాన్ జంక్షన్ వరకు కళ్లు పొడుచుకున్నా కనిపించని పరిస్థితి నెలకొంది. ఉంగుటూరు, తేలప్రోలు, ఆత్కూరు ప్రాంతాల్లో విజిబిలిటీ తగ్గడంతో వాహనదారులు హెడ్‌లైట్లు వేసుకుని అతి కష్టమ్మీద ప్రయాణిస్తున్నారు.