పత్తి పంటలో మొగ్గ రాలుటకు నివారణకు చర్యలు: ఏడీఏ

KRNL: ఎమ్మిగనూరు ఏడీఏ ఖాద్రి రైతులకు ఇవాళ పలు సూచనలు చేశారు. ఖరీఫ్ సీజన్‌లో ప్రస్తుతం కురిసిన వర్షాలకు పత్తి పంటలో మొగ్గ, పూత, పిందే రాలడం గమనించామన్నారు. వీటి నివారణకు రైతులు పొటాషియం నైట్రేట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలన్నారు. తర్వాత ప్లానోఫిక్స్ 1 మిల్లీ లీటర్, 5 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేయాలన్నారు.