గ్రామానికి సేవ చేద్దామని సర్పంచ్‌గా పోటీ
BHNG: ఆలేరు మండలం గొలనుకొండ గ్రామానికి సేవ చేద్దామని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఇందూరి యాదగిరి రెడ్డి అన్నారు. శనివారం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. గతంలో తనకి ఏ పదవి లేకుండా స్కూల్‌లో నల్లబల్లాలు, తడి చెత్త పొడి చెత్త బకెట్ల పంపిణీ తదితర కార్యక్రమాలు చేశామని తెలిపారు.