జొమాటో షాక్.. పెరిగిన ప్లాట్‌ఫామ్ ఫీజు

జొమాటో షాక్.. పెరిగిన ప్లాట్‌ఫామ్ ఫీజు

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇకపై వినియోగదారులు ప్రతి ఆర్డర్‌పై అదనంగా రూ. 2.40 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మొత్తం ఫీజు రూ.14.90కి చేరింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల పెరుగుతున్న చమురు ధరలే ఈ పెంపునకు ప్రధాన కారణమని తెలుస్తోంది.