జిల్లాలో ఎరువుల కొరత లేదు: కలెక్టర్

ELR: జిల్లాలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని రైతులకు తెలియజేయాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలికాన్ఫరెన్స్‌లో వ్యవసాయాధికారులను ఆదేశించారు. బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు అమ్మిన డీలర్లపై కేసులు నమోదు చేయాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పథకం పెండింగ్ కేసులపై వెంటనే చర్యలు తీసుకుని అర్హులైన రైతులందరికీ లబ్ధి చేరేలా చూడాలన్నారు.