అంగన్వాడీలకు మొబైల్ ఫోన్‌లు పంపిణీ
కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో అంగన్వాడి కార్యకర్తలకు నూతన మొబైల్ ఫోన్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అవనిగడ్డ సెక్టార్ పరిధిలోని 142 మంది అంగన్వాడీ కార్యకర్తలకు నూతన 5జీ మొబైల్స్‌ను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.