గూడూరు డీఎస్పిని కలిసిన నేదురుమల్లి

NLR: గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి.గీతా కుమారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బోర్డు మాజీ ఛైర్మన్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి గూడూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలు విషయాలు గురించి డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు.