పోచారం ప్రాజెక్టులోకి స్వల్ప వరద నీరు
KMR: నాగిరెడ్డిపేట మండల రైతులకు పోచారం ప్రాజెక్ట్ వరప్రదాయినిగా నిలుస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా, ఈ ఖరీఫ్లో భారీ వర్షాల వల్ల 29.797 టీఎంసీల వరద వచ్చి చేరింది. 27.596 టీఎంసీల నీరు మంజీరా ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్లింది. శనివారం ప్రాజెక్టులోకి 444 క్యూసెక్కుల స్వల్ప వరద వస్తుందని ప్రాజెక్టు డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు.