VIDEO: మహాశివరాత్రి శోభలో కాశీ విశ్వేశ్వర ఆలయం
వరంగల్ నగరంలోని శ్రీ కాశి విశ్వేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచే హరిహరుల దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. సోమేశ్వరుడికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందుతున్నారు.