కాళేశ్వరం పిటిషన్.. రేపే తుది తీర్పు
TG: రాష్ట్రంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంపై రేపు రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. ఈ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించబోతుండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.