ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి: మాజీ ఎమ్మెల్యే
KMM: తల్లాడ మండలం గొల్లగూడెం నూతన సర్పంచ్ కోడూరు ఉమాదేవి వీరకృష్ణ, ఉపసర్పంచ్ తోటపల్లి నాగలక్ష్మి గురువారం ఖమ్మంలోని నివాసంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని శాలువాతో సత్కరించిన సండ్ర.. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు.