'పాఠశాల విలీనాన్ని ఆపాలని విద్యార్థుల నిరసన'

KDP: చాపాడు మండలం చియ్యపాడు గ్రామ ఎస్సీ కాలనీలో ఉన్న పాఠశాలను మోడల్ స్కూల్ పేరుతో విలీనం ఆపాలని విద్యార్థులు సోమవారం కడప కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. 'మా కాలనీ స్కూల్ మాకే ఉండాలి' అని కోరుకుంటూ విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.