VIDEO: గ్రామస్తులకు అగ్నిమాపక సిబ్బంది అవగాహన
కృష్ణా: గుడివాడ మండలం లింగవరం గ్రామంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి అవగాహన లోపంతో అగ్ని ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని సామాజిక కార్యకర్త రవికిరణ్ అన్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన లింగేశ్వర, అగ్నిమాపక సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.