'తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది'

'తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది'

కోనసీమ: గోగన్నమఠం గ్రామ పరిధిలోని తోటమెరకలో బుధవారం రూ. 30 లక్షల NGT నిధులతో నిర్మించనున్న వాటర్ ట్యాంకుకు రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ ట్యాంక్ నిర్మాణంతో ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, గ్రామాభివృద్ధిలో ఇది మరో కీలక అడుగని పేర్కొన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించడమే లక్ష్యమన్నారు.