'ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలి'

WNP: ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని మాజీ మంత్రి, BRS నేత, WNP మాజీ ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆకాంక్షించారు. పాక్ ఉగ్రవాదం, ఉగ్రవాద స్థావరాలను తుద ముట్టించాలని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్‌కు భారత దేశమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. పహల్గామ్ దాడికి భారత సైన్యం సరైన సమాధానం ఇస్తోందని ప్రశంసించారు. జై జవాన్ అంటూ నినాదాలు చేశారు.