'పంచాయతీ కార్యదర్శులకు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం'
PPM: సీతంపేట ITDA పరిధిలోని పంచాయతి కార్యదర్శులకు కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం జన్మన్, ఆది కర్మయోగి, పీఎం జుగా పథకాలపై సోమవారం ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ITDA PO వి. సునీల్ మాట్లాడుతూ.. ఈ పథకాలతో గిరిజనులకు అధిక మేలు జరుగుతుందన్నారు. ఈ పథకాల్లో ఉన్న అంశాలపై పంచాయతీ సెక్రటరీలు పూర్తి అవగాహనతో ఉండాలని సూచించారు.