పొన్నూరులో పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం
GNTR: పొన్నూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలోని స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా పారిశుధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం 22వ వార్డు రోటరీ క్లబ్ భవనంలో ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కమిషనర్ రమేష్ బాబు ప్రారంభించారు. ఈ శిబిరంలో కార్మికులకు షుగర్, బీపీ, కంటి చూపుతో పాటు ఇతర సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను వైద్యులు పంపిణీ చేశారు.