రైతుల ఖాతాల్లోకి రూ. 22. 27 కోట్లు జమ: కలెక్టర్

రైతుల ఖాతాల్లోకి రూ. 22. 27 కోట్లు జమ: కలెక్టర్

అన్నమయ్య: రాయచోటి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో శుక్రవారం 'అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్' మూడో విడత నిధుల పంపిణీ జరిగింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, TDP నాయకులు లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో 6 మండలాలలోని 39,031 మంది రైతులకు ₹22.27 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ అయ్యాయి. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు.