తండ్రి చనిపోయిన పరీక్ష రాసిన విద్యార్థి

తండ్రి చనిపోయిన పరీక్ష రాసిన విద్యార్థి

KDP: పులివెందులలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సోమవారం బయమ్మ తోటలో నివసిస్తున్న దండు శివయ్య కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. ఆయన కుమార్తె ధరణి పదవ తరగతి చదువుతోంది. తండ్రి మరణించిన రోజు ఉదయం ఆమె పదవ తరగతి పరీక్ష రాయాల్సి వచ్చింది. ఈ దుఃఖాన్ని దిగమింగుకొని, ధరణి పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.