VIDEO: సీనియర్లను కలుపుకోకపోతే గెలవడం కష్టం: ఎమ్మెల్యే
ATP: టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ ఆలూరులో మాత్రం వాల్మీకులు నిరుత్సాహంగా ఉన్నారని ఆ పార్టీ గుంతకల్లు MLA గుమ్మనూరు జయరాం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి జ్యోతి పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులను కలుపుకుని పోవడంలో పార్టీ విఫలమైందని, స్థానిక ఎన్నికల్లో సీనియర్లను కలుపుకోకపోతే గెలవడం కష్టమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.