శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
AP: తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 68,075 మంది భక్తులు దర్శించుకోగా.. 26,535 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.8 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.