నిధులు కేటాయించాలని మంత్రి జూపల్లికి వినతి
ADB: ఉట్నూరు మండలానికి వచ్చిన జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు రుపేష్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బేల మండలంలోని సాంగిడి గ్రామ సమీపంలో గల పెనుగంగా వాగు వద్ద నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించాలని విన్నవించారు. ఈ అంశంపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.