BREAKING: టెన్షన్.. టెన్షన్
AP: NTR జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీమంత్రి జోగి రమేశ్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో ఆయన ఇంటికి వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో సిట్, ఎక్సైజ్ అధికారులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు.