పార్క్ చేసిన కారులో చెలరేగిన మంటలు

W.G: తణుకు పట్టణ పరిధిలో శనివారం ఓ కారు అగ్నికి ఆహుతి అయింది. ఈ ప్రమాదం కంతేరు గ్రామానికి చెందిన రిషి అనే వ్యక్తి బ్యాంకు కాలనీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి వచ్చి, కార్ పార్క్ చేసి, ఆసుపత్రికి వెళ్లి వచ్చే లోపు మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.